![]() |
![]() |
.webp)
సోషల్ మీడియాలో చిరంజీవి సాంగ్ "ఆంటీ కూతురా" అంటూ అద్భుతమైన స్టెప్పులేసి అడగరగొట్టేసిన మురళి బాబాయ్ గురించి తెలియని వారుండరు. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి ఆయన్ని ఢీ షోకి కూడా పిలిపించారు. ఇక ఇప్పుడు "ఈ దీపావళికి మాస్ జాతర" షోకి కూడా పిలిచారు. "సల్లకొచ్చి ముంత దాస్తే లాభంలేదు " అనే సాంగ్ కి అభి మాష్టర్, రోహిణి అలాగే శేఖర్ మాష్టర్ తో కలిసి డాన్స్ ఇరగదీసాడు డాన్సర్ మురళి బాబాయ్. ఆయన డాన్స్ కి శేఖర్ మాష్టర్ ఐతే "హ్యాట్సాఫ్ సర్ హ్యాట్సాఫ్ " అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఇక ఈయన డాన్స్ చేస్తే పండు మాష్టర్ కి ఐతే ఎక్కడలేని ఊపు వచ్చేస్తుంది. ఇక నాగబాబు కూడా ఆయన డాన్స్ కి ఫిదా ఇపోయారు. "చిరంజీవి గారిని ఎప్పుడైనా కలిసారా" అని అడిగారు. "లేదు సర్. కలవాలని నా కోరిక" అంటూ మురళి బాబాయ్ చెప్పుకొచ్చారు.
"ఐతే ఆయన్ని కల్పిస్తాను. చక్కగా ఆయనతో కూర్చుని ఒక కప్పు కాఫీ తాగి చక్కగా ఒక ఫోటో తీసుకుందురు గాని .నేను మీకు ఇవ్వగలిగే చిన్న ఫెవర్ ఇదొక్కటే" అంటూ మాట ఇచ్చారు. ఆల్రెడీ ఢీ షోలో అభి మాష్టర్ తో కలిసి గతంలో వచ్చిన ఒక ఎపిసోడ్ లో డాన్స్ ఇరగదీసేసరికి ఆది వచ్చి మురళి బాబాయ్ ని హగ్ చేసుకుని కాళ్ళకు దణ్ణం పెట్టుకున్నాడు. అలాగే చిరంజీవిని కల్పించే ఏర్పాటు చేయిస్తాను అని చెప్పాడు. ఇక ఇప్పుడు నాగబాబు మురళి బాబాయ్ కి చిరుని కల్పించేందుకు అవకాశం కల్పిస్తామంటూ మాట ఇచ్చారు.
![]() |
![]() |